Top Ad unit 728 × 90

ఈసీఐఎల్‌ - హైదరాబాద్‌ రిక్రూట్‌మెంట్‌ 2024... అర్హతలివే...!

ఈసీఐఎల్‌ - హైదరాబాద్‌ రిక్రూట్‌మెంట్‌ 2024... అర్హతలివే...!

 

నిరుద్యోగులకు శుభవార్త ఈసీఐఎల్ హైదరాబాద్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) జాబ్‌ నోటిఫికేషన్ ప్రకటించింది.

 

ఈ నోటిఫికేషన్ ద్వారా 30 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టుల భర్తీ జరగనుంది. దేశ వ్యాప్తంగా ఉన్న ఈసీఐఎల్‌ ప్రాజెక్టు పనుల్లో గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తోంది.

 

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఇంజినీరింగ్‌ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు అప్లయ్ చేసుకునేందుకు ఏప్రిల్‌ 13 చివరితేదిగా నిర్ణయించారు. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం https://www.ecil.co.in/ ఈ వెబ్‌సైట్ ను సంప్రదించొచ్చు. రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ల వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

 

ఇతర వివరాలు ఇలా ఉన్నాయి...

గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులు:  మొత్తం 30

 

విభాగాల వారీ ఖాళీల వివరాలు: ఈసీఈ- 5, ఈఈఈ- 7, మెకానికల్- 13, సీఎస్‌ఈ- 5 వంటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

 

విద్యార్హత: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ/ పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.

 

వయసు : (13.04.2024 నాటికి) 27 సంవత్సరాలు మించకూడదు.

 

జీతభత్యాలు: ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.40,000 - 1,40,000గా వేతనంగా ఉంటుంది.

 

ఎంపిక విధానం: రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ల వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

 

దరఖాస్తు రుసుము వివరాలు: యూఆర్‌/ ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ అభ్యర్థులు 1000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

 

ఏప్రిల్‌ 13, 2024 ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీగా నిర్ణయించారు.

 

ఈసీఐఎల్‌ - హైదరాబాద్‌ రిక్రూట్‌మెంట్‌ 2024... అర్హతలివే...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *